![]() |
![]() |

నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన ఎస్ఆర్ శేఖర్(ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో అందాల భామ కేథరిన్ త్రెసా నటించనుందని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
'మాచర్ల నియోజకవర్గం'లో నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కేథరిన్ నటించనుందని గతంలో వార్తలొచ్చాయి. ఈ సినిమాలో నితిన్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తాడని, ఆయనను ఆరాధించే యువతి పాత్రలో కేథరిన్ కనిపించనుందని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాలో కేథరిన్ పాత్ర ఎలా ఉంటుందో స్పష్టత రాలేదు కానీ.. ఆమె ఈ సినిమాలో నటిస్తున్నట్లు తాజాగా మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. మూవీ టీమ్ లోకి కేథరిన్ కు స్వాగతం చెబుతూ మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు.

సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2022, ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |