![]() |
![]() |

అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న 'బంగార్రాజు' మూవీలో నాగచైతన్య కూడా ఓ హీరోగా నటిస్తున్నాడు. నాగ్ జోడీగా ఒరిజినల్ 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో నటించిన రమ్యకృష్ణ ఈ ప్రీక్వెల్‌లోనూ తన పాత్రను నిలుపుకోగా, చైతూ జోడీగా సెన్సేషనల్ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది. కల్యాణ్‌కృష్ణ కురసాల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో కృతి చేస్తున్న పాత్ర పేరు నాగలక్ష్మి. ఆమె ఫస్ట్ లుక్‌ను గురువారం ఉదయం రివీల్ చేస్తున్నట్లు చైతూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలియజేశారు. నిన్న ఓ పోస్టర్‌ను షేర్ చేసిన చైతూ, "నవంబర్ 18 ఉదయం 10:18 గంటలకు 'బంగార్రాజు' నుంచి మా నాగలక్ష్మి ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయబోతున్నాం" అని ట్వీట్ చేశాడు.
దీనికి నాగ్ రెస్పాండ్ అయ్యాడు. చైతూ పోస్ట్‌ను రిట్వీట్ చేసిన ఆయన, దానికి "బాగుందిరా.. కానీ బంగార్రాజు సంగతేంటి?" అనే సరదా కామెంట్ పెట్టాడు. తండ్రి కామెంట్‌కు కొడుకు ప్రతిస్పందించాడు. "త్వరలోనే నానా" అని రిప్లై ఇచ్చాడు.

'బంగార్రాజు'లో నాగార్జున పాత్రకూ, చైతూ పాత్రకూ మధ్య కనెక్షన్ ఏమిటనేది వెల్లడి కాలేదు కానీ, ఇద్దరి పాత్రల మధ్య బంధుత్వం ఉంటుందని తెలిసింది. ఆ ఇద్దరూ కలిసి నటిస్తోన్న రెండో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం మైసూర్‌లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా, సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |