![]() |
![]() |

శాండల్‌వుడ్‌ను షేక్ చేసిన డ్రగ్స్ కేసులో తారలు సంజన, రాగిణి డ్రగ్స్ వాడినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యిందనీ, ఈ మేరకు బెంగళూరు పోలీసులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారనీ వార్తలు వచ్చిన నేపథ్యంలో సంజన అనారోగ్యం బారిన పడింది. దాంతో ఆమె స్థానిక ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తల్లి రేష్మా గల్‌రాని తెలియజేశారు. "దేనికైనా తలరాత బావుండాలి. మేం ఎలాంటి తప్పు చేయలేదని మాకు తెలుసు. రోజూ పేదలకు అన్నదానం చేస్తున్నాం. సంజన ఆరోగ్యం బాలేదు. తనను హాస్పిటల్‌లో చేర్పించాం." అని ఆమె చెప్పారు.
కాగా, చార్జిషీట్‌లో తను డ్రగ్స్ సేవించినట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పేర్కొనడంపై మరో నిందితురాలు రాగిణి ద్వివేది సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయ్యింది. "నువ్వు ఆగిపోలేదు. ముందడుగు వేసేముందు నువ్వు రిఆర్గనైజ్ చెయ్యాలి. నువ్వు నిశ్శబ్దంగా లేవు, స్వీయ సాధికారత సాధించడం ఎలాగో నువ్వు నేర్చుకుంటున్నావని వినిపించాలి. నువ్వు కోల్పోవడం లేదు, అనుభవాల ద్వారా ఎదుగుతున్నావు. నువ్వు విడిచిపెట్టబడలేదు, ఎదగడానికి కావాల్సిన చోటును కనుగొంటున్నావు. నువ్వు విచ్ఛిన్నం కాలేదు, నీ పురోగతికి పునర్నిర్మాణం చేస్తున్నావు. నువ్వు నిరంతరం మరింతగా రూపొందుతున్నావు." అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది.
ఆమెతో మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించగా, స్పందించడానికి నిరాకరించింది. ఈ కేసు విషయంలో ఏం చేయాలనేదానిపై తన లాయర్‌తో ఆమె సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |