Home

»

Latest News

'స‌ర్కారు వారి పాట‌'కి ఓ బిగ్‌ హైలైట్.. గోవా ఫైట్

Aug 25, 2021 4:35PM

 

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు సినిమాల్లో యాక్ష‌న్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవ‌ల్ లో ఉంటాయి. `ఒక్క‌డు`, `అత‌డు`, `పోకిరి`, `దూకుడు`, `భ‌ర‌త్ అనే నేను`.. ఇలా మ‌హేశ్ న‌టించిన ప‌లు చిత్రాల్లో పోరాట ఘ‌ట్టాలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఈ జాబితాలోనే మ‌హేశ్ బాబు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ 'స‌ర్కారు వారి పాట‌' కూడా చేరుతుంద‌ట‌.  మ‌రీముఖ్యంగా.. ఇటీవ‌ల గోవా షెడ్యూల్ లో షూట్ చేసిన భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకి ఓ హైలైట్ గా నిలుస్తుంద‌ని బ‌జ్. 

రామ్ - ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో చిత్రీక‌రించిన ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ కి థియేట‌ర్స్ లో విజిల్స్ ప‌క్కా అన్న‌ది ఇన్ సైడ్ టాక్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. 'స‌ర్కారు వారి పాట‌'లో మ‌హేశ్ కి జోడీగా కీర్తి సురేశ్ న‌టిస్తుండ‌గా.. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు. 

మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబి ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న 'స‌ర్కారు వారి పాట‌' థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. 'భ‌ర‌త్ అనే నేను', 'మ‌హ‌ర్షి', 'స‌రిలేరు నీకెవ్వ‌రు' వంటి హ్యాట్రిక్ మూవీస్ త‌రువాత మ‌హేశ్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో  'స‌ర్కారు వారి పాట‌'పై భారీ అంచ‌నాలే నెల‌కొని ఉన్నాయి.   

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com