![]() |
![]() |

కరోనాకు ముందు స్టార్ట్ చేసిన కొన్ని భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ అవసరం ఉన్న సినిమాల షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ, గుణశేఖర్ మాత్రం అప్పుడే షూటింగ్ కంప్లీట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. గతంలో భారీ కాస్ట్యూమ్ డ్రామాలు తీసిన అనుభవమో, పక్కా ప్రణాళికతో పాటు దిల్ రాజు లాంటి నిర్మాత అండగా ఉంటూ డబ్బుకు ఏమాత్రం లోటు లేకుండా చూడటమో... అన్నీ కలిసి వచ్చాయో, 'శాకుంతలం' సినిమా చిత్రీకరణను గుణశేఖర్ పూర్తి చేశాడు.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రగా రూపొందుతున్న దృశ్యకావ్యం 'శాకుంతలం'. ఈ సినిమా శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న సినిమా. దీనిని ఐదు నెలల్లో గుణశేఖర్ కంప్లీట్ చేశారు. పైగా, చిత్రీకరణకు ఎక్కువ రోజులు తీసుకోలేదు. జస్ట్, 81 డేస్ మాత్రమే తీసుకున్నారు. ఆయన అంత స్పీడుగా తీయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన మాత్రం పక్కా ప్లానుతో షూటింగ్ చేశారని స్పీడ్ చూస్తుంటే తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన విషయాన్ని నిర్మాత నీలిమ గుణ ట్వీట్ చేశారు. దాంతో పాటు తండ్రికి ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేశారు.

'శాకుంతలం'లో సమంత పార్ట్ ఆగస్ట్ సెకండ్ వీక్ లో ఫినిష్ చేశారు. దుష్యంతుడిగా నటిస్తున్న హీరో దేవ్ మోహన్ మీద ఆ తర్వాత ఒక వార్ సీక్వెన్స్ తీశారు. దాన్ని కూడా మండే నైట్ తో ఫినిష్ చేశారు. దీంతో సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలన్స్ ఉంది. అది కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా టైమ్ ఉంది.
![]() |
![]() |