![]() |
![]() |

`7/జి బృందావన కాలనీ`, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`, `యుగానికి ఒక్కడు` చిత్రాలతో తెలుగునాట దర్శకుడిగా తనదైన ముద్రవేశాడు సెల్వ రాఘవన్. తమిళంలో స్టార్ డైరెక్టర్ హోదా చూసిన ఈ టాలెంటెడ్ కెప్టెన్.. ప్రస్తుతం ఆర్టిస్ట్ గా బిజీ అయ్యే పనుల్లో ఉన్నాడు. ఇప్పటికే కీర్తి సురేశ్ తో కలిసి `సాని కాయిదమ్` అనే ఓ సినిమా చేశాడు సెల్వ. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. అతి త్వరలో ఓటీటీలో స్ట్రీమ్ కానుందని బజ్.
ఇదిలా ఉంటే.. `సాని కాయిదమ్` విడుదలకు ముందే ఓ భారీ బడ్జెట్ మూవీలో నటించే అవకాశం దక్కించుకున్నాడు సెల్వ రాఘవన్. ఆ సినిమా మరేదో కాదు.. కోలీవుడ్ స్టార్ విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న `బీస్ట్`. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు ఈ వెర్సటైల్ డైరెక్టర్. అంతేకాదు.. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 2 కోట్ల భారీ పారితోషికం అందుకున్నట్లు సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `బీస్ట్` 2022 పొంగల్ కి థియేటర్స్ లో సందడి చేయనుంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాద రూపంలో రిలీజ్ కానుంది.
![]() |
![]() |