![]() |
![]() |

'సింహా' తర్వాత చాన్నాళ్ల దాకా మళ్లీ హిట్ లేకపోవడంతో రేస్ నుంచి బాలకృష్ణ పూర్తిగా తొలగిపోయాడనుకున్నాయి వైరి వర్గాలు (వీవీ). అవి చంకలు గుద్దుకుంటూ ఉండగానే 'లెజెండ్'ని అంటూ వచ్చాడు. ఈయనేం లెజెండ్? అందరివాడనుకున్న వాణ్ణే కొందరివాడుగా మిగిల్చిన జనం బాలయ్యను 'లెజెండ్'గా ఒప్పుకుంటారా?.. అని వైరి వర్గాలు కుప్పిగంతులు వేశాయి. ఏమైంది? తిక్క కుదిరింది. 'లెజెండ్'గా బాలయ్యను జనం ఏకగ్రీవంగా ఒప్పేసుకున్నారు. ఆ సినిమా కాస్తా ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు వసూలుచేసి పెట్టింది. ఆ మూవీలో బాలయ్య డబుల్‌రోల్ చేసి మెప్పించాడు.
దాని తర్వాత 'లయన్'గా వచ్చిన బాలయ్యను జనం యాక్సెప్ట్ చెయ్యలేదు. ఆల్రెడీ 'సింహా'గా నిన్ను ఒప్పేసుకున్నాం కదా, మళ్లీ భాష మార్చి 'లయన్'గా రావడమెందుకని అడిగేశారు జనం. వైరి వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఆ తర్వాత బాలయ్య నేను 'డిక్టేటర్'ని అన్నాడు. ఈ రోజుల్లో డిక్టేటర్‌షిప్ నడవదు కాబట్టి జనం ఈ సినిమాని అంతగా నడవనివ్వలేదు. ఆ తర్వాత 'గౌతమిపుత్ర శాతకర్ణి' వేషంలో మన ముందుకు వచ్చాడు. జనం బ్రహ్మరథం పట్టారు.
ఆపైన 'పైసా వసూల్' అన్నాడు బాలయ్య. ఊహు.. మేం నువ్వడిగినంత ఇవ్వం, కొంతే ఇస్తామన్నారు జనం. 'జై సింహా' అన్నాడు. జనం పెద్దగా స్పందించలేదు. తండ్రి బయోపిక్ చేస్తానని 'కథానాయకుడు', 'మహానాయకుడు' అంటూ రెండు భాగాలు చేశాడు. జనం ఎందుకనో తిప్పికొట్టేశారు. నేను 'రూలర్'ను అన్నా కూడా జనం అస్సలు పట్టించుకోలేదు. ఒక బాలయ్య పని అయిపోయిందని వైరి వర్గాలు తీవ్రంగా ప్రచారం చేశాయి.
బాలయ్యను ఒక 'సింహా'గా, ఒక 'లెజెండ్'గా ప్రెజెంట్ చేసిన బోయపాటి శ్రీను మళ్లీ ఆయన బాధ్యతను తీసుకున్నాడు. 'అఖండ' అంటూ రిలీజ్ చేసిన టీజర్ చూసి, జనం పిచ్చెక్కిపోయారు. గతంలో ఎప్పుడూ బాలకృష్ణ సినిమా టీజర్‌ను ఆదరించని రీతిలో, మిగతా స్టార్లు చాలామంది సినిమాల టీజర్ల కంటే చాలా ఎక్కువ మంది దాన్ని చూసేశారు. 'అఖండ'లో బాలయ్య రెండు పాత్రల్ని చేస్తున్నాడు. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయ్యే అవకాశం 'అఖండ'కు ఉందని ఇప్పటికే చాలామంది ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చేశారు. జనానికి వినోదాల విందు తప్పదని అంటున్నారు. వీవీకి ఈసారి భంగపాటు తప్పదని వారు ఘంటాపథంగా చెబుతున్నారు.
![]() |
![]() |