![]() |
![]() |

టాలీవుడ్ లో ప్రస్తుతం హవా సాగిస్తున్న స్వరకర్తల్లో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఒకరు. ప్రస్తుతం తమన్ చేతిలో డజనుకి పైగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గమనించదగ్గ అంశమేమంటే తమన్ ముచ్చటగా ముగ్గురు స్టార్స్ కి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కి సంగీతమందించే అవకాశం పొంది వార్తల్లో నిలుస్తున్నాడు. ఆ స్టార్స్ మరెవరో కాదు.. నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు.
బాలయ్య విషయానికి వస్తే.. విడుదలకు సిద్ధమవుతున్న `అఖండ`కి, రాబోయే గోపీచంద్ మలినేని డైరెక్టోరియల్ కి తమనే సంగీత దర్శకుడు. ఇక పవన్ ప్రీవియస్ మూవీ `వకీల్ సాబ్`కి బాణీలు అందించిన తమన్.. రాబోయే `భీమ్లా నాయక్`కి కూడా స్వరాలు సమకూరుస్తున్నాడు. అలాగే మహేశ్ సంగతి తీసుకుంటే.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న `సర్కారు వారి పాట`కి.. అనంతరం రాబోయే త్రివిక్రమ్ డైరెక్టోరియల్ కి కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్.
మొత్తమ్మీద బాలయ్య, పవన్, మహేశ్.. ఇలా ముగ్గురు స్టార్ హీరోల కాంబినేషన్స్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కి పనిచేసే అరుదైన ఛాన్స్ కొట్టేశాడన్నమాట తమన్. మరి.. ఆయా చిత్రాలన్నీ ఈ స్టార్ కంపోజర్ కి పాజిటివ్ రిజల్ట్స్ ని అందిస్తాయే, లేదో చూడాలి.
![]() |
![]() |