![]() |
![]() |

``దాక్కో దాక్కో మేక`` అంటూ ఫస్ట్ సింగిల్ తో ఇంప్రెస్ చేసిన `పుష్ప` యూనిట్.. త్వరలో సెకండ్ సింగిల్ తో రాబోతుందా? అవునన్నదే ఫిల్మ్ నగర్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ - ఇండియా మూవీ `పుష్ప`.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా, మొదటి భాగం `పుష్ప - ద రైజ్`ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఆగస్టు నుంచి నెలకో సింగిల్ చొప్పున ఐదు నెలల పాటు ఐదు సింగిల్స్ ని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తూ వచ్చేలా స్కెచ్ వేసిందట యూనిట్. ఈ క్రమంలోనే.. ఆగస్టు 13న ఫస్ట్ సింగిల్ ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. కథానాయకుడి పరిచయ గీతంలా ఉన్న `పుష్ప ఫస్ట్ సింగిల్` ఇన్‌స్టంట్ హిట్ గా నిలిచింది. కాగా బన్నీ, రష్మికపై చిత్రీకరించిన రొమాంటిక్ నంబర్ ని సెకండ్ సింగిల్ గా సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. త్వరలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది.
ఇదిలా ఉంటే.. `పుష్ప`కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.
![]() |
![]() |