![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ త్వరలో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో అర్హ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలియజేస్తూ తాజాగా బన్నీ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' సినిమా ద్వారా అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు బన్నీ. "శాకుంతలం సినిమాతో అల్లు వారి నాలుగో తరం కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతోంది. సమంతతో వైవిధ్యమైన జర్నీ కొనసాగించాను. ఆమె సినిమా ద్వారా అర్హ నటిగా పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. శాకుంతలం టీమ్ కు ఆల్ ది బెస్ట్" అంటూ బన్నీ ట్వీట్ చేశారు.

గుణ టీం వర్క్స్, దిల్ రాజు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ మూవీలో సమంత శకుంతల పాత్రలో నటిస్తోంది. దుష్యంతుడి పాత్రలో మళయాల నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. వారిద్దరికీ పుట్టే చిన్నారి భరతునిగా అర్హ నటించనున్నట్లు ప్రకటించారు. అంటే తన తొలి సినిమాలో అబ్బాయి పాత్రలో అర్హ అలరించనున్నదన్న మాట.
![]() |
![]() |