![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి వచ్చే ఒక్కో అప్డేట్ ఈ మూవీపై అంచనాలను మరింత పెంచుతోంది. తాజాగా 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ మేకింగ్ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది.
'ఆర్ఆర్ఆర్' మేకింగ్ వీడియో చూస్తుంటే.. ఊహించిన దానికి మించి.. భారీ స్థాయిలో సినిమా రూపొందుతోందని అర్థమవుతోంది. భారీ సెట్లు, భారీ తారాగణంతో వెండితెరపై అసలుసిసలు మల్టీస్టారర్ ను చూడబోతున్నాం. the master story teller and his team అంటూ విల్లు పట్టుకొని ఉన్న రాజమౌళితో పాటు.. ఇతర సాంకేతిక నిపుణులను చూపిస్తూ వీడియో ప్రారంభమైంది. మూవీ టీమ్ తో కెప్టెన్ రాజమౌళి సీరియస్ గా డిస్కస్ చేస్తున్న షాట్స్ కనిపించాయి. ఇక బ్రిటీష్ కాలం నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడం కోసం మూవీ టీమ్ బాగా కష్టపడిందని మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తోంది. కొన్ని షాట్స్ లో తారక్, చరణ్ కనిపించిన తీరు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. చేతిలో ఆయుధం పట్టుకొని గాలిలో ఎగురుతూ ఫైట్ చేయడం, చరణ్ ఖాకీ డ్రెస్ లో కనిపించడం, తారక్ అడవిలో పరుగెత్తడం వంటి షాట్స్ మెప్పిస్తున్నాయి. ఇక వీరిని బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఫ్యాన్స్ కి రెండు కళ్ళు చాలవనే చెప్పాలి.
మేకింగ్ వీడియోలో తారక్, చరణ్ తో పాటు ఇతర కీలక పాత్ర ధారులు కూడా కనిపించారు. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, సముద్రఖని, శ్రియల లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అజయ్ దేవ్‌గణ్ చేతిలో బుల్లెట్ పట్టుకొని సీరియస్ లుక్ తో చూస్తున్న షాట్ తో మేకింగ్ వీడియో ఎండ్ అయింది. మొత్తానికి ప్రేక్షకులు మెచ్చే ఔట్ పుట్ కోసం రాజమౌళితో పాటు మూవీ టీమ్ ఎంత కష్టపడుతుందో కళ్ళకి కట్టినట్టు చూపించారు. అలాగే ఈ మేకింగ్ వీడియోకి కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్' ఈ ఏడాది అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అంటూ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మొత్తానికి అక్టోబర్ 13 న అససిసలు సినిమా పండగ మొదలుకానుంది అన్నమాట.
![]() |
![]() |