![]() |
![]() |

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే ఈ మూవీ టీమ్ ను తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ సర్‌ప్రైజ్ చేశారు.
బుధవారం సెట్స్ కి స్టార్ డైరెక్టర్ శంకర్ రావడంతో మూవీ టీమ్ సర్‌ప్రైజ్ అయింది. ఆయనకు ఘన స్వాగతం పలికి.. ఆయనతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసింది మూవీ టీమ్. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. "సోమవారం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. హీరో రామ్, హీరోయిన్ కృతీ శెట్టి, నదియా తదితరులపై లింగుసామి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సడన్‌గా సెట్స్‌కు వచ్చిన శంకర్ గారిని చూసి టీమ్ అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. ఆయనకు రామ్, కృతి, నదియా, లింగుసామి స్వాగతం పలికారు. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన లవ్ సాంగ్ ట్యూన్ వినిపించారు. మెలోడీయస్ గా ఉందని, చాలా బావుందని ఆయన ప్రశంసించడం మాకెంతో సంతోషాన్నిచ్చింది" అన్నారు.
హీరోగా రామ్ పోతినేనికి 19వ చిత్రమిది. అందుకని, RAPO19గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.
![]() |
![]() |