![]() |
![]() |

ఈ దీపావళికి `అణ్ణాత్తే`గా సందడి చేయబోతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న `సిరుత్తై` శివ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తుండగా.. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ వంటి నాలుగు విభిన్న తరాలకు చెందిన కథానాయికలు ఇందులో ప్రధాన పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. జాకీష్రాఫ్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ వంటి విలక్షణ నటులు ఇందులో ముఖ్య వేషాల్లో కనిపించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి డి. ఇమాన్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. `అణ్ణాత్తే`కి సంబంధించిన చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ ని కోల్ కతాలో ప్లాన్ చేశారు. ఇందుకోసం ఇప్పటికే రజినీకాంత్ కోల్ కతా చేరుకున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటోందని సమాచారం. నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుంది. కాగా, గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కుటుంబ కథా చిత్రంలో రజినీకాంత్ సరికొత్తగా కనిపిస్తారని వినికిడి. మరి.. `ఎందిరన్` (రోబో) తరువాత సరైన విజయం లేని సూపర్ స్టార్ కి.. నవంబర్ 4న విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా సాలిడ్ హిట్ అందిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |