![]() |
![]() |

అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్.. ఒకే తేదిన అభిమానులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నారు. కాకపోతే, వేర్వేరు భాషల్లో వీరిద్దరు సందడి చేయనుండడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ లో `లాల్ సింగ్ చద్ధా` పేరుతో ఓ హిందీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అమెరికన్ ఫిల్మ్ `ఫారెస్ట్ గంప్` (1994) ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆర్మీ ఆఫీసర్ గా చైతూ పాత్ర ఉంటుందని టాక్. కాగా, ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయడానికి యూనిట్ ప్లాన్ చేసింది.
కట్ చేస్తే.. అదే రోజు అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న ఐదో చిత్రం `ఏజెంట్` కూడా విడుదల కాబోతోంది. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి రూపొందించనున్న ఈ స్పై డ్రామాని డిసెంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. సో.. చైతూ, అఖిల్ ఒకే తేదిన వేర్వేరు భాషల్లో అభిమానులకు వినోదం పంచనున్నారన్నమాట. మరి.. ఈ చిత్రాలతో అక్కినేని బ్రదర్స్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
ఇదిలా ఉంటే.. క్రిస్మస్ లోపే చైతూ `లవ్ స్టోరి`, `థాంక్ యూ` చిత్రాలతో పలకరించనుండగా.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`గా అఖిల్ అలరించనున్నాడు.
![]() |
![]() |