![]() |
![]() |

విభిన్న పాత్రలు, చిత్రాలతో సత్యదేవ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'తిమ్మరుసు' షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది.
తిమ్మరుసు సినిమాను ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాతలు మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు తెలిపారు. జూలై 30న థియేటర్స్ లో విడుదలయ్యే ఈ సినిమా ఖచ్చితంగా బెస్ట్ మూవీగా అందరి ప్రశంసలు అందుకుంటుంది అని నిర్మాతలు అన్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. థియేటర్స్ రీఓపెన్ చేయడానికి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పటివరకు తేదీపై స్పష్టత రాలేదు. తాజాగా తిమ్మరుసు విడుదల తేదిని ప్రకటించడం చూస్తోంటే త్వరలోనే థియేటర్స్ రీఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
కాగా, ఈ సినిమా ద్వారా శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటించగా.. ఒక ముఖ్యమైన పాత్రలో రవిబాబు కనిపించనున్నాడు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.
![]() |
![]() |