![]() |
![]() |

'ఆర్‌ఎక్స్ 100' మూవీతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆయన తన రెండో సినిమాగా 'మహా సముద్రం' చేస్తున్నాడు. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ మరో అప్డేట్ ను ప్రకటించింది.
'మహా సముద్రం' సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలియజేస్తూ.. మేకర్స్ తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో శర్వానంద్, సిద్ధార్థ్ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇద్దరు పిడికిలి బిగించి నవ్వుతూ ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. దీంతో 'మహా సముద్రం' మూవీ షూటింగ్ పూర్తయ్యింది. అలాగే సినిమాను త్వరలో ధియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశముంది.
ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌తో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమాతో అజయ్ భూపతి మరో విజయం అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |