![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ ధనుష్ కి అచ్చొచ్చిన దర్శకుల్లో మిత్రన్ జవహర్ ఒకరు. ధనుష్, మిత్రన్ కాంబినేషన్ లో వచ్చిన `యారాడి నీ మోహిని` (`ఆడవారి మాటలకు అర్థాలే వేరులే` రీమేక్), `కుట్టి` (`ఆర్య` రీమేక్), `ఉత్తమ పుత్రన్` (`రెడీ` రీమేక్) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలనే నమోదు చేసుకున్నాయి. కట్ చేస్తే.. 11 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ నాలుగోసారి జట్టుకట్టనుందట. అంతేకాదు.. ధనుష్ 44వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో హన్సిక, నిత్యా మీనన్, ప్రియా భవాని నాయికలుగా నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే ధనుష్ - మిత్రన్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది.
కాగా, ధనుష్ ప్రస్తుతం `ఆత్రంగి రే` (హిందీ), కార్తిక్ నరేన్ డైరెక్టోరియల్ (తమిళ్), `ద గ్రే మ్యాన్` (ఆంగ్లం) చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే తన సోదరుడు, ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. అదేవిధంగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కలిసి ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారు. మరోవైపు.. `తొలిప్రేమ` ఫేమ్ వెంకి అట్లూరితోనూ ధనుష్ సినిమా చేయబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి.
![]() |
![]() |