![]() |
![]() |

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న మూవీ 'శ్రీదేవి సోడా సెంటర్'. 'పలాస 1978' సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిలో పడిన కరుణకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు.
'శ్రీదేవి సోడా సెంటర్' మూవీలోని 'మందులోడా ఓరి మాయలోడా' అనే సాంగ్ లిరికల్ వీడియోను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సాంగ్ చేశారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాట.. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. కాసర్ల శ్యామ్ దీనికి లిరిక్స్ అందించగా.. సాహితి చాగంటి, ధనుంజయ ఈ సాంగ్ ను పాడారు.
పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సుధీర్ బాబుకి జంటగా ఆనంది నటిస్తోంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక సుధీర్ బాబు ఈ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ మూవీలో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
![]() |
![]() |