![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - 'తానాజీ' ఫేమ్ ఓమ్ రౌత్ కాంబినేషన్ లో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'. ఇందులో శ్రీరామచంద్రుడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ దర్శనమివ్వనున్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. టి-సిరీస్ ఫిల్మ్స్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాయి. 'పెంగ్విన్' ఫేమ్ కార్తిక్ పళని ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. 'ఆదిపురుష్' చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తున్నారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. సచేత్ - పరంపర ద్వయం 'ఆదిపురుష్'కి బాణీలు సమకూర్చనున్నారట. సెన్సేషనల్ హిట్ 'కబీర్ సింగ్'తో పాటు 'టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథ', 'బట్టి గుల్ మీటర్ చాలు', 'పతి పత్ని ఔర్ వో', ఓమ్ రౌత్ డైరెక్టోరియల్ 'తానాజీ' చిత్రాలకు సచేత్ - పరంపర బాణీలు సమకూర్చారు. అలాగే ప్రభాస్ 'సాహో'లో 'సైకో సయ్యా' హిందీ వెర్షన్‌కు సచేత్ గాత్రమందించారు.
త్వరలోనే 'ఆదిపురుష్'లో సచేత్ - పరంపర ఎంట్రీపై క్లారిటీ రానుంది. సచేత్-పరంపర గత ఏడాది నవంబర్‌లోనే దంపతులయ్యారు కూడా. కాగా, 2022 ఆగస్టు 11న 'ఆదిపురుష్'ని విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
![]() |
![]() |