![]() |
![]() |
.jpg)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - 'కేజీఎఫ్' కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ పాన్ - ఇండియా మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్', 'ఎన్టీఆర్ 30' తరువాత తారక్ చేయబోయే సినిమా ఇది. అలాగే, 'కేజీఎఫ్ ఛాప్టర్ 2', `సలార్` తరువాత ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న చిత్రమిది. 2022 ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో తారక్ కి జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. పాన్ - ఇండియా వెంచర్ కావడంతో జాన్వి కూడా ఈ మూవీపై ఆసక్తి చూపిస్తోందని వినికిడి. త్వరలోనే 'ఎన్టీఆర్ 31'లో జాన్వీ కపూర్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో 'దోస్తానా 2', 'గుడ్ లక్ జెర్రీ' చిత్రాలున్నాయి. 2008 నాటి సూపర్ హిట్ ఫిల్మ్ 'దోస్తానా'కి సీక్వెల్ గా 'దోస్తానా 2' తెరకెక్కుతుండగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన సూపర్ హిట్ కోలీవుడ్ మూవీ 'కోలమావు కోకిల' (2018)కి రీమేక్ గా 'గుడ్ లక్ జెర్రీ' రూపొందుతోంది.
![]() |
![]() |