![]() |
![]() |

‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వింటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఎలివేషన్స్. కేజీఎఫ్ చాప్టర్ 1 లో హీరో ఎలివేషన్స్ మాములుగా ఉండవు. ఇక చాప్టర్ 2 లో అయితే చాప్టర్ 1 ని మించిన ఎలివేషన్స్ ఉంటాయని ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే రీల్ హీరో చేతితో ఆయుధం పట్టించి ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చే ప్రశాంత్ నీల్.. రియల్ లైఫ్ లో మాత్రం చిన్న సూదికి భయపడుతున్నారు అంటూ ఆయన మీద నెటిజన్స్ ఫన్నీ సెటైర్స్ వేస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. తాజాగా ప్రశాంత్ నీల్ తొలి వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటున్న సమయంలో భయంతో కళ్లకు చేతులు అడ్డుపెట్టుకుని కూర్చున్న ఫొటోను ఆయన తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నేను వ్యాక్సిన్ తీసుకున్నా. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకుని మీ కుటుంబ సభ్యులతో వ్యాక్సిన్ తీసుకోండి’’ అని పోస్ట్ చేశారు. అయితే వ్యాక్సినేషన్ ఫొటో చూసిన నెటిజన్లు ప్యాన్ ఇండియా స్థాయి చిత్రాలు తీస్తున్న దర్శకుడికి వ్యాక్సిన్ అంటే ఇంత భయమా? అని కామెంట్లు పెడుతున్నారు.
ప్రశాంత్ నీల్ పోస్ట్ చేసిన ఫోటో పై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "రాకీ భాయ్ లాంటి వైలెంట్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఈయన.. చిన్న ఇంజక్షన్ కి భయపడుతున్నారు" అని సెటైర్స్ వేస్తున్నారు. కొందరైతే "వ్యాక్సిన్ వేయించుకోవడమంటే కోల్ మైన్స్ లో షూటింగ్ చేసినంత ఈజీ కాదు నీల్ మావా" అని కామెంట్ చేస్తున్నారు.
![]() |
![]() |