![]() |
![]() |

బాహుబలితో రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాహుబలి తరువాత నుంచి ఆయన సినిమాలపై దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభాస్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన చేసిన రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు మూవీ గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ.400 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా సినిమాలు ఓటీటీల బాట పడుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' సినిమా కూడా ఓటీటీలోనే విడులయ్యింది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థల కన్ను స్టార్ హీరోల సినిమాలపై పడింది. ముఖ్యంగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. గతంలో ఈ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.300 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని.. కానీ, ఆ ఆఫర్ కు మేకర్స్ నో చెప్పారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ. 400 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఆఫర్ కు నిర్మాతలు ఓకే చెప్తారో చూడాలి.
![]() |
![]() |