![]() |
![]() |

తెలుగు తెరపై త్వరలో 'డియర్ మేఘ' అంటూ మరో క్యూట్ లవ్ స్టోరీ సందడి చేయనుంది. మేఘా ఆకాష్,అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పలు ఓటీటీ సంస్థల నుండి మంచి ఆఫర్స్ వస్తున్నాయని మూవీ టీం చెబుతోంది. ఇక హీరో అరుణ్ ఆదిత్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'డియర్ మేఘ' న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

తాజాగా రిలీజ్ చేసిన 'డియర్ మేఘ' పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. "హీరో అరుణ్ ఆదిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. 'డియర్ మేఘ' లో అరుణ్ ఆదిత్ పాత్ర సూపర్బ్ గా ఉంటుంది. అరుణ్ ఆదిత్ నటన ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది" అన్నారు.
నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ... "మా హీరో అరుణ్ ఆదిత్ కు పుట్టనరోజు శుభాకాంక్షలు. 'డియర్ మేఘ' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో సహా కంప్లీట్ అయ్యింది. త్వరలో ఓ బిగ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద 'డియర్ మేఘ' విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా 'డియర్ మేఘ'ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్మకంతో ఉన్నాం." అని తెలిపారు.
![]() |
![]() |