![]() |
![]() |
.jpg)
'కృష్ణగాడి వీర ప్రేమ గాథ', 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' చిత్రాలతో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది మెహ్రీన్. ఆ తరువాత ట్రాక్ తప్పిన ఈ ముద్దుగుమ్మ 'ఎఫ్ 2'తో మళ్ళీ సక్సెస్ చూసింది. ఆపై 'చాణక్య', 'ఎంత మంచివాడవురా' చిత్రాలతో డిజాస్టర్స్ చూసింది. 'అశ్వత్థామ'తో ఫర్వాలేదనిపించుకుంది. ఈ నేపథ్యంలో.. తన ఆశలన్నీ రాబోయే చిత్రం 'ఎఫ్ 3'పైనే పెట్టుకుంది.
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో జట్టుకట్టిన ప్రతీసారి మెహ్రీన్‌కు మంచి విజయాలే దక్కాయి. మెహరీన్ - అనిల్ ఫస్ట్ కాంబినేషన్ మూవీ 'రాజా ది గ్రేట్', సెకండ్ కాంబినేషన్ మూవీ 'ఎఫ్ 2' రెండు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఈ క్రమంలో.. 'ఎఫ్ 3'తో అనిల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ అందుకుంటానన్న ధీమాతో ఉంది మెహ్రీన్. మరి.. మెహ్రీన్‌కు అనిల్ హ్యాట్రిక్ ఇస్తాడో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్‌కి జంటగా మెహ్రీన్ ఓ సినిమా చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతోందని వినికిడి. మరోవైపు.. భవ్య బిష్ణోయ్ అనే యంగ్ పొలిటికల్ లీడర్ తో పెళ్ళికి రెడీ అయి ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళిన మెహ్రీన్.. కోవిడ్ కారణంగా పెళ్ళి వాయిదా పడడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారిస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
![]() |
![]() |