![]() |
![]() |

'వైఫ్' చిత్ర దర్శకులు, రచయిత, నటులు రావిపల్లి రాంబాబు జన్మదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం 'పద్మశ్రీ' చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించింది. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, "నా అభిమాన ఆత్మీయుడు, అయిన ఎస్.ఎస్. పట్నాయక్ చిత్ర దర్శకునిగా మారడమే కాకుండా సొంతంగా ఎస్.ఎస్. పిక్చర్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది." అన్నారు.. ఈ సందర్భంగా పద్మశ్రీ మోషన్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు శివ నాగేశ్వర రావు, దేవి ప్రసాద్, వీరశంకర్, మోహన్ గౌడ్, చిత్తరంజన్, వర్ధమాన నటుడు దినేష్ తదితరులు హాజరయ్యారు.
అందరికీ క్యాచీగా ఉండే పేరు 'పద్మశ్రీ' అని, పోస్టర్స్ కూడా ఇన్నోవేటివ్ గా ఉన్నాయని దర్శకులు శివ నాగేశ్వరావు గారు కొనియాడగా... అంతా కొత్తవారితో చేసిన ప్రయత్నం సక్సెస్ అయితే ఎంతోమంది నూతన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు గుర్తింపు అవకాశాలు లభిస్తాయని దర్శకులు దేవి ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 'పద్మశ్రీ' అనే టైటిల్ తోనే దర్శక నిర్మాతలు సగం సక్సెస్ సాధించేశారని దర్శకులు వీరశంకర్ అన్నారు!
చిత్ర రచయిత, దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ, సినిమా ప్రారంభం నుండి ప్రతి విషయానికి ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించకుండా తనపై ఎంతో.. పూర్తి నమ్మకంతో వారి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్తూ చిత్ర ఎడిటర్ కంబాల శ్రీనివాస రావుకు, కో ప్రొడ్యూసర్స్ మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణలకు తన కృతజ్ఞతలు తెలియజేశారు!
ఎస్.ఎస్.పిక్చర్స్ బ్యానర్ పై జ్యోతి, రావిపల్లి సంధ్య, కనిక ఖన్నా, రమ్య, కిషోర్, సతీష్, హర్ష, కాళీ చరణ్, చక్రి, ఫన్నీ రాజు, డా. ప్రవీణ్, జయశ్రీ, ఎస్ ఎస్ పట్నాయక్ ఇలా అంతా వర్ధమాన నటీనటులతో చేసిన యాక్షన్ ఓరియంటెడ్ హారర్ కామెడీ ఫిలిం 'పద్మశ్రీ'కి నిర్మాత: సదాశివుని శిరీష, ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, సంగీతం: జాన్ పోట్ల, ఆర్ట్: మణిపాత్రుని, ఫైట్స్: దేవరాజు మాస్టర్, డాన్స్ తారక్, వెంకట్, గ్రాఫిక్స్: డాట్ యానిమేషన్ కంపెనీ.
![]() |
![]() |