![]() |
![]() |

యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోమారు జట్టుకట్టనున్న విషయం విదితమే. `అరవింద సమేత` తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న సెకండ్ జాయింట్ వెంచర్ ని.. యన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఉగాది పర్వదినాన నిర్వహించి.. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ కి తీసుకెళ్ళనున్నారట. అంతేకాదు.. వచ్చే ఏడాది వేసవిలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఇప్పటికే రిలీజ్ డేట్ గా 2022 ఏప్రిల్ 29ని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మరి కొద్ది రోజుల్లో.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్న `యన్టీఆర్ 30`కి `అయినా పోయి రావలె హస్తినకు`, `రాజా వచ్చినాడు`, `చౌడప్ప నాయుడు` వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
కాగా, తారక్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. ఇందులో చరిత్ర పురుషుడు కొమురం భీమ్ పాత్రలో యన్టీఆర్ దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |