![]() |
![]() |

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలన్నీ దాదాపుగా మ్యూజికల్ హిట్సే. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, చక్రి, శశిప్రీతమ్, సందీప్ చౌతా, శ్రీ.. ఇలా ఎవరి కాంబినేషన్ లో కృష్ణవంశీ సినిమాలు చేసినా మ్యూజికల్ గా ఆయా చిత్రాల ఆల్బమ్స్ అన్నీ బాగా స్కోర్ చేశాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కృష్ణవంశీ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి `రంగమార్తాండ` కాగా, మరొకటి `అన్నం`. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న `రంగమార్తాండ`కి ఇళయరాజా బాణీలు అందిస్తున్నారు. సుదీర్ఘవిరామం తరువాత కృష్ణవంశీ కాంబోలో ఇళయరాజా చేస్తున్న సినిమా కావడంతో `రంగమార్తండ` పాటలపై మంచి అంచనాలే ఉన్నాయి.
కాగా, మహాశివరాత్రి సందర్భంగా కృష్ణవంశీ ప్రకటించిన `అన్నం` (`పరబ్రహ్మ స్వరూపం` అనేది దీనికి ట్యాగ్ లైన్) చిత్రానికి స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రహమాన్ స్వరాలు సమకూర్చబోతున్నారని వినికిడి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మరి.. కృష్ణవంశీ - రహమాన్ ఫస్ట్ కాంబోలో రాబోతున్న `అన్నం` మ్యూజికల్ గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
![]() |
![]() |