![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య`తో బిజీగా ఉన్నారు. తన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ సోషల్ డ్రామా.. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రంజాన్ వీకెండ్ స్పెషల్ గా మే 13న `ఆచార్య` థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలయ్యేలోపే చిరు.. తన నెక్స్ట్ వెంచర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఘనవిజయం సాధించిన `లూసిఫర్`ని తెలుగులో మెగాస్టార్ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఏప్రిల్ రెండో వారం నుంచి పట్టాలెక్కనుందట. అలాగే.. ఇదే ఏడాది చివరలో సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
కాగా, `లూసిఫర్` రీమేక్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తమన్ బాణీలు అందిస్తున్న మొదటి చిత్రమిదే కావడం విశేషం. ఇదివరకు చిరు అతిథి పాత్రలో నటించిన `బ్రూస్ లీ`కి తమన్ స్వరాలు సమకూర్చారు.
![]() |
![]() |