![]() |
![]() |

తెలుగునాట ప్రస్తుతం నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు తమన్. ఇటీవల `క్రాక్` రూపంలో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్.. ఈ ఏప్రిల్ లో వరుస చిత్రాలతో సందడి చేయనున్నాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 1న తమన్ స్వరసారథ్యంలో రూపొందిన కన్నడ చిత్రం `యువరత్న` రిలీజ్ కానుంది. పునీత్ రాజ్ కుమార్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమా.. తెలుగులోనూ అదే రోజున అనువాదం కానుంది. ఇక ఏప్రిల్ 2న తమన్ నేపథ్య సంగీతం అందించిన `వైల్డ్ డాగ్` విడుదల కానుంది. ఇందులో కింగ్ నాగార్జున ప్రధాన పాత్ర పోషించారు.
ఇక ఏప్రిల్ 9న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీ `వకీల్ సాబ్` జనం ముందుకు రానుంది. `పింక్`కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకి తమన్ బాణీలు అందించారు. పవన్ తో తమన్ కి ఇదే ఫస్ట్ కాంబో మూవీ కావడం విశేషం. అలాగే ఏప్రిల్ 23న నేచురల్ స్టార్ నాని నటించిన `టక్ జగదీష్` రిలీజ్ కానుంది. దీనికి కూడా తమన్ నే స్వరకర్త.
మొత్తమ్మీద.. ఏప్రిల్ నెలలో 4 ఆసక్తికరమైన చిత్రాలతో తమన్ సందడి చేయబోతున్నాడన్నమాట. మరి.. ఈ సినిమాలతో తమన్ ఎలాంటి ఫలితాలు అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |