![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబుని సరికొత్తగా ఆవిష్కరించిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ ఫ్లిక్ `అతడు` తెలుగునాట ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇక సెకండ్ వెంచర్ `ఖలేజా` వెండితెరపై నిరాశపరిచినా బుల్లితెరపై విశేషాదరణ పొందింది. కట్ చేస్తే.. దాదాపు పుష్కరకాలం తరువాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్ ఇటీవల మహేశ్ కోసం ఓ స్టోరీ లైన్ వినిపించారని.. అది నచ్చడంతో మాటల మాంత్రికుడితో సినిమా చేసేందుకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు.. 2022 మార్చిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని, ఆ తరువాతే దర్శకధీరుడు రాజమౌళితో మహేశ్ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని వినికిడి.
కాగా, ప్రస్తుతం మహేశ్ `సర్కారు వారి పాట`తో బిజీగా ఉన్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సోషల్ డ్రామా 2022 సంక్రాంతికి రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ విషయానికొస్తే.. యంగ్ టైగర్ యన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కి వెళ్ళనుంది. 2022 వేసవికి ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.
![]() |
![]() |