![]() |
![]() |

'కేజీఎఫ్' కెప్టెన్ ప్రశాంత్ నీల్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా 'సలార్'. యాక్షన్ సాగాగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ కి జోడీగా శ్రుతి హాసన్ దర్శనమివ్వనుంది. 'కేజీఎఫ్' నిర్మాణ సంస్థ హొంబళే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది.
ఇదిలా ఉంటే.. 'సలార్'కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. గతంలో తమన్ పేరు వినిపించినా.. అది వార్తలకే పరిమితమయ్యింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి రవి బస్రుర్ బాణీలు అందిస్తున్నట్లు తెలిసింది. ప్రశాంత్ రూపొందించిన ఉగ్రం, కేజీఎఫ్ ఛాప్టర్ 1తో పాటు కేజీఎఫ్ ఛాప్టర్ 2కి కూడా రవినే సంగీత దర్శకుడు. ఈ నేపథ్యంలోనే.. 'సలార్'కి కూడా రవిని స్వరకర్తగా కొనసాగిస్తున్నాడట ప్రశాంత్.
ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కూడా రవి.. 'సలార్'కి తను బాణీలు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చాడని శాండల్ వుడ్ బజ్. త్వరలోనే 'సలార్'లో రవి బస్రుర్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
![]() |
![]() |