![]() |
![]() |

కింగ్ నాగార్జున, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో 'విశ్వాసమ్' ఫేమ్ అనిఖ సురేంద్రన్, బాలీవుడ్ యాక్ట్రస్ గుల్ పనాగ్ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రవీణ్ సత్తారు డైరెక్టోరియల్ లో నాగ్ పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఈ చిత్రంలో నాగ్ బిలియనీర్ రోల్ లో కనిపించనున్నారట. ఈ క్యారెక్టర్ ని ప్రవీణ్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారని.. సినిమా హైలైట్స్ లో నాగ్ క్యారెక్టరైజేషన్ ఒకటని సమాచారం. త్వరలోనే నాగ్ పాత్రకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
కాగా, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'వైల్డ్ డాగ్' త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే నాగ్ కీలక పాత్రలో నటించిన హిందీ చిత్రం 'బ్రహ్మాస్త్ర' కూడా ఇదే ఏడాదిలో విడుదల కానుంది.
![]() |
![]() |