![]() |
![]() |

పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్టర్‌గా పరిచయమైన 'ఉప్పెన' సినిమా టైటిల్‌కు తగ్గట్లే తొలిరోజే కలెక్షన్లలో ఉప్పెనను తలపించింది. నెగటివ్ రోల్‌లో విజయ్ సేతుపతి నట విశ్వరూపం ప్రదర్శించిన 'ఉప్పెన' సూపర్బ్ మౌత్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ దిశగా తొలి అడుగును దిగ్విజయంగా వేసింది.
శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు రెండు రాష్ట్రాల్లో సుమారు రూ. 9.3 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. నైజాంలో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.85 కోట్లు, రాయలసీమలో రూ. 1.35 కోట్లను ఈ సినిమా రాబట్టింది. ఒక మీడియం బడ్జెట్ ఫిల్మ్‌కు, అందునా కొత్త హీరో హీరోయిన్లు, కొత్త డైరెక్టర్‌తో రూపొందిన సినిమా మొదటి రోజు ఈ స్థాయి వసూళ్లను సాధించడం అసాధారణం. రెండు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 19 కోట్లకు అమ్ముడుపోగా, తొలిరోజు 49 శాతం దాకా రికవర్ అవడం విశేషం. లాక్‌డౌన్ అనంతరం విడుదలైన తెలుగు సినిమాల్లో 'ఉప్పెన' తొలిరోజు వసూళ్లదే అగ్రస్థానం.
ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను సాహసోపేతంగా డైరెక్టర్ కన్విన్సింగ్‌గా చూపించిన విధానం, ప్రధాన పాత్రధారుల నటన, కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్, డీఎస్పీ సూపర్బ్ మ్యూజిక్ కలిసి 'ఉప్పెన'ను బ్లాక్‌బస్టర్ మూవీగా నిలుపుతున్నాయి.
![]() |
![]() |