![]() |
![]() |

'నిన్ను కోరి' వంటి విజయవంతమైన చిత్రం తరువాత నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా 'టక్ జగదీష్'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నానికి అన్నయ్యగా జగపతిబాబు నటిస్తుండగా.. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ నాయికలుగా సందడి చేయనున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సంక్రాంతికి కొద్ది రోజుల ముందు ఏప్రిల్ 16న 'టక్ జగదీష్' థియేటర్స్ లోకి రాబోతుందంటూ చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అదే ఏప్రిల్ 16కి యువ సామ్రాట్ నాగచైతన్య, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'లవ్ స్టోరీ' కూడా రాబోతుందని అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. 'టక్ జగదీష్' విడుదల తేదిపై రకరకాల కథనాలు వచ్చాయి. ఏప్రిల్ 23కి ఈ సినిమా వాయిదా పడిందని కొన్ని మీడియా వర్గాలు రాసుకొచ్చాయి కూడా. తాజాగా, 'టక్ జగదీష్' రిలీజ్ డేట్ పై ఫస్ట్ లిరికల్ వీడియోలో క్లారిటీ ఇచ్చేసింది యూనిట్. ఫస్ట్ సింగిల్ వీడియో చివరలో ఏప్రిల్ 23న ఈ సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు.
మరి.. గత కొంతకాలంగా సరైన విజయం లేని నానిని.. ఏప్రిల్ 23న రానున్న 'టక్ జగదీష్' అయినా సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువస్తుందేమో చూడాలి.
![]() |
![]() |