![]() |
![]() |

ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు తనయుడు హీరో సుమంత్ అశ్విన్ పెళ్లికొడుకు అవుతున్నారు. ఈరోజు హైదరాబాద్ శివార్లలోని ఎం.ఎస్. రాజు ఫామ్‌హౌస్‌లో గోరింటాకు వేడుకతో పెళ్లి సందడి మొదలైంది. డల్లాస్‌లో రీసెర్చి సైంటిస్ట్‌గా పనిచేస్తున్న దీపిక మెడలో సుమంత్ మూడు ముళ్లు వేయనున్నాడు. ఆమెది హైదరాబాదే.
గోరింటాకు వేడుకలో ఆ ఇద్దరూ జంటగా కూర్చొని, గోరింటాకు పెట్టుకున్న తమ చేతులను చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. దీపిక అయితే మెహందీ వేసుకున్న తన కాళ్లను కూడా ప్రదర్శిస్తున్నారు. అలాగే తండ్రితో కలిసి మరో ఫొటోకు పోజు ఇచ్చాడు సుమంత్. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో నేటి సాయంత్రమే సుమంత్ అశ్విన్, దీపిక వివాహ వేడుక జరగనున్నది.

ప్రస్తుతం సుమంత్ అశ్విన్ 'ఇదే మా కథ' అనే బైక్ జర్నీ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రధారులు. మరోవైపు 'డర్టీ హరి' సినిమా సక్సెస్‌తో డైరెక్టర్‌గా ఎం.ఎస్. రాము హ్యాపీ మోడ్‌లో ఉన్నారు.

![]() |
![]() |