![]() |
![]() |

వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో 'సముద్రం' ఒకటి. 1999లో విడుదలైన ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
కట్ చేస్తే.. నాడు 'సముద్రం'లో కథానాయకుడిగా నటించిన జగ్గూ భాయ్.. ఇప్పుడు 'మహా సముద్రం' పేరుతో రూపొందుతున్న సినిమాలో ఓ విలక్షణ పాత్రలో దర్శనమివ్వనున్నారు. జగపతిబాబు బర్త్ డే సందర్భంగా తన పోషిస్తున్న పాత్రకు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసింది యూనిట్. "చుంచు మామ"గా సరికొత్త లుక్ లో ఇందులో కనిపిస్తున్నారాయన. మరి.. 'సముద్రం' లాగే 'మహా సముద్రం' కూడా జగపతిబాబుకి నటుడిగా మంచి గుర్తింపుని తీసుకువస్తుందేమో చూడాలి.
కాగా, అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న 'మహా సముద్రం'లో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 19న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |