![]() |
![]() |

చాన్నాళ్ళ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్.. రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ పిరియడ్ లవ్ సాగాలో ప్రభాస్ కి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో భాగ్యశ్రీ, జయరామ్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలుంటాయని టాక్. అందులో నాలుగు పాటలు మెలోడీయస్ గా సాగుతాయని, ఒక పాట మాత్రం ఫాస్ట్ బీట్ గా ఉంటుందని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, రాధేశ్యామ్ కి సంబంధించిన టీజర్ ని వేలంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ వెల్లడించింది. అందులో భాగంగానే ఓ ప్రి-టీజర్ ని శనివారం విడుదల చేసి.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
![]() |
![]() |