![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ పిరియడ్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నారు. వెటరన్ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కి జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో దర్శనమివ్వనున్నట్లు టాక్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఇందులో పవన్ పోషిస్తున్న వీరమల్లు పాత్రనే టైటిల్ గా ఫిక్స్ చేసే దిశగా యూనిట్ ఆలోచిస్తోందట. త్వరలోనే పవన్ - క్రిష్ మూవీకి సంబంధించిన టైటిల్ అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది. కాగా, ఇదివరకు ఈ సినిమాకి విరూపాక్ష, హరహర మహాదేవ వంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.
పవన్ - క్రిష్ కాంబినేషన్ మూవీకి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు. 2022 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుందని టాక్.
![]() |
![]() |