![]() |
![]() |

క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తున్న చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఒకటి సాఫ్ట్ రోల్ కాగా, మరొకటి రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్. కాగా, రవితేజ ద్విపాత్రాభినయం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఐదు సినిమాల్లో డ్యూయెల్ రోల్ చేశారు. అయితే, వాటిలో క్లిక్ అయింది ఒకే ఒక సినిమా మాత్రమే.
ఓ పనైపోతుంది బాబూ! (1998), విక్రమార్కుడు (2006), దరువు (2012), కిక్ 2 (2015), డిస్కో రాజా (2020).. ఇలా ఇప్పటికే ఐదు చిత్రాల్లో రవితేజ డబుల్ యాక్షన్ చేయగా.. ఒక్క విక్రమార్కుడు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిగిలిన నాలుగు సినిమాలూ నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో.. ఈ డ్యూయెల్ రోల్స్ యాక్షన్ ఖిలాడికి ప్లస్ అవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
వేసవి కానుకగా మే 28న ఖిలాడి థియేటర్స్ లో సందడి చేయనుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |