![]() |
![]() |

దేత్తడి హారిక బిగ్‌బాస్ సీజన్ 4తో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో తనదైన మార్కు వీడియోలతో ఇచ్చిపడేసిన హారిక బిగ్‌బాస్ టాప్ 5 వరకు వెళ్లి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. టైటిల్‌ని దక్కించుకోలేకపోయినా హ్యూజ్ ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ సీజన్ పూర్తియిన తరువాత గత కొన్ని రోజులుగా తన యూట్యూబ్ వీడియోలకి కాస్త బ్రేకిచ్చిన హారిక మళ్లీ తన హంగామా మొదలుపెట్టింది.
రొటీన్‌కి భిన్నంగా ప్లాన్ చేసి బిగ్బాస్ ఫ్రస్ట్రేషన్ పేరుతో ఓ ప్రోమోని విడుదల చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరైన దగ్గరి నుంచి బయటికి వచ్చే వరకు తనపై వచ్చిన కామెంట్స్.. గాసిప్స్..హాట్ న్యూస్‌ని తన తాజా వీడియోకి కంటెంట్‌గా వాడుకుంది. హారిక సినిమాల్లోకి వెళుతుందా? లేక వెబ్ సిరీస్‌లలో నటిస్తుందా? అంటూ వస్తున్న ప్రశ్నలకు గట్టిగానే సమాధానం చెప్పింది.
తనదైన తెలంగాణ యాసలో అందరూ సల్లబడండి..వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చుట్టాలు.. స్నేహితులూ అంతా ఒకటే ప్రశ్న నెక్స్ట్ ఏంటీ? అని. మద్యాహ్నం లేచి రాత్రి స్నానం చేసే టైపు నేను. బిగ్‌బాస్‌లో వున్న మొత్తం మంది 2 గంటల్లో స్నానం చేయాలి అంటే పెద్ద సాహసమే` అంటూ బిగ్‌బాస్‌పై తన ఫ్రస్ట్రేషన్‌ని వెల్లగక్కింది.
![]() |
![]() |