![]() |
![]() |

రామ్ పోతినేని హీరోగా నటించిన 'రెడ్' మూవీ జనవరి 14న విడుదలైంది. కవల సోదరులుగా అతను చేసిన డ్యూయల్ రోల్‌కు ప్రశంసలు లభించాయి కానీ, బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రీతిలో కలెక్ట్ చేయలేకపోయింది ఆ సినిమా. అందుకే సంక్రాంతి విన్నర్ అనే ట్యాగ్ రెడ్ మూవీకి లభించలేదు. ఒక క్లాస్, మరొక మాస్ క్యారెక్టర్ చేసినప్పటికీ, మాస్ క్యారెక్టర్‌కు కిక్కిచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవడం మైనస్‌గా మారింది. ఉన్న ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కవల సోదరుల మధ్యే ఉండటం ఆడియెన్స్‌కు కిక్కునివ్వలేదు.
ఆ విషయం అలా ఉంచితే, 'రెడ్' తర్వాత ఇంత దాకా రామ్ మరో సినిమాని స్టార్ట్ చెయ్యలేదు. ఏ డైరెక్టర్‌తో వర్క్ చేయబోతున్నాడో కూడా వెల్లడి కాలేదు. సురేందర్ రెడ్డి, బాబీ, వెంకీ కుడుముల పేర్లు రంగంలోకి వచ్చాయి కానీ, ఏదీ ఫైనల్ కాలేదు.
ఉన్నట్లుండి రామ్ భక్తి మార్గంలోకి వెళ్లాడు. శివ దీక్ష పుచ్చుకున్నాడు. శనివారం పసుపు రంగు చొక్కా, లుంగీ, కండువా ధరించిన ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. నుదుటిన శివ నామాలు, కళ్లకు బ్లాక్ గాగుల్స్, చేతిలో సెల్ ఫోన్‌తో కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. ఇక్కడ కూడా తన స్టైల్‌ను అతను మిస్సవలేదు!
ఆ ఫొటోతో పాటు, "Om Namah Shivaya! Small break.. I’ll be back!! Love.. #RAPO (ఓం నమశ్శివాయ.. చిన్న విరామం.. తిరిగొస్తాను! ప్రేమతో..)" అని రాసుకొచ్చాడు. ఎన్ని రోజులు ఆ దీక్షలో ఉంటాడో, ఎప్పుడు తిరిగి కెమెరా ముందుకు వస్తాడో.. త్వరలో వెల్లడవుతుంది.

![]() |
![]() |