![]() |
![]() |

కేజీఎఫ్ ఛాప్టర్ 1 తరువాత తెలుగునాట కన్నడ అనువాద చిత్రాల హవా మరింత పెరిగింది. ఇక ఈ ఏడాది అయితే.. వరుసగా మూడు నెలల పాటు కన్నడ డబ్బింగ్ సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 19న ధృవ సర్జా, రష్మిక మందన్న జంటగా నటించిన పొగరు చిత్రం రిలీజ్ కానుంది. కన్నడ, తెలుగు భాషల్లో ఒకే రోజున ఈ సినిమా విడుదల కానుంది.
ఇక మార్చి నెల విషయానికి వస్తే.. శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ నటించిన రాబర్ట్ సినిమా రిలీజ్ కానుంది. జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 11న కన్నడ, తెలుగు భాషల్లో ఒకే రోజున జనం ముందుకు రానుంది.
అలాగే ఏప్రిల్ నెల విషయానికి వస్తే.. ఈ నెలలో పునీత్ రాజ్ కుమార్, సయ్యేషా సైగల్ జంటగా నటించిన యువరత్న చిత్రం రిలీజ్ కానుంది. ఏప్రిల్ 2న ఈ సినిమా కన్నడంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది.
ఇలా.. మూడు వరుస నెలల్లో కన్నడ చిత్రాలు అనువాద రూపంలో రిలీజ్ కానుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి.. వీటిలో ఏయే సినిమాలకు ఆదరణ దక్కుతుందో చూడాలి.
కాగా, కేజీఎఫ్ ఛాప్టర్ 2 జూలై 16న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో సహా పలు భాషల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే.
![]() |
![]() |