![]() |
![]() |

కెరీర్ ఆరంభంలో దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు వంటి విజయవంతమైన చిత్రాలతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనిపించుకున్న ఉత్తరాది భామ లావణ్య త్రిపాఠి.. ఆపై అరడజను ఫ్లాపులతో ఐరెన్ లెగ్ ట్యాగ్ మూటగట్టుకుంది. అయితే గత చిత్రం 'అర్జున్ సురవరం' ఆలస్యంగా జనం ముందుకు వచ్చినా.. అంతిమంగా విజయం సాధించి లావణ్యకి ఊరటనిచ్చింది.
కట్ చేస్తే.. ప్రజెంట్ ఈ టాలెంటెడ్ బ్యూటీ రెండు సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా మూడు వారాల గ్యాప్ లో థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఆ సినిమాలే.. 'A1 ఎక్స్‌ప్రెస్', 'చావు కబురు చల్లగా'. సందీప్ కిషన్ కి జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 'A1 ఎక్స్‌ప్రెస్' ఫిబ్రవరి 26న విడుదల కానుండగా.. కార్తికేయకి జోడీగా నటించిన 'చావు కబురు చల్లగా' మార్చి 19న రిలీజ్ కానుంది. అటు సందీప్‌తో, ఇటు కార్తికేయతో ఆమె నటించడం ఇదే తొలిసారి. మరి.. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో లావణ్యకి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.
![]() |
![]() |