![]() |
![]() |

స్టార్ మాలో పాపులర్ సీరియల్‌గా మహిళామణుల నీరాజనాలందుకుంటోంది 'కార్తీక దీపం'. ప్రముఖ రచయిత, నటుడు ఓంకార్ తనయుడు నిరుపమ్ నటిస్తూ నిర్మిస్తున్నారు. ఇందులో దీపగా వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి వైద్యనాథ్ స్టార్ హీరోయిన్ తరహాలో పాపులారిటీని దక్కించుకుంది. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారం అవుతున్న సీరియల్స్‌లో టాప్ 1 పొజిషన్‌లో నిలిచిన సీరియల్ 'కార్తీక దీపం'.
ఈ ధారావాహికకు రోజు రోజుకీ అభిమానులు పెరిగిపోతున్నారు. ఈ సోమవారం ఎపిసోడ్ రసవత్తర మలుపులు తిరగబోతోంది. ఈ రోజు 950వ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఈ రోజు ఎపిసోడ్‌లో డాక్టర్ బాబు మోనితకు అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. వంటలక్క వద్ద వున్న హిమకి ఐడ్రాప్స్ వేయడానికి వెళ్లిన డాక్టర్ బాబుకు మీతో రెండే రెండు రోజులు వుంటానంటూ కండిషన్ పెట్టి షాకిస్తుంది శౌర్య. అందుకు ఒప్పుకున్న డాక్టర్ బాబు "వెళ్లవే రౌడీ.. ఇంట్లోకెళ్లి బట్టలు సర్దుకుని రా.." అంటాడు.. దీంతో ఆనందానికి లోనైన శౌర్య డాక్టర్ బాబుతో ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతుంది...
కట్ చేస్తే 951 ఎపిసోడ్ బుధవారం ట్విస్టులతో సాగబోతోంది. డాక్టర్ బాబు తను ఎంతగానో ఇష్టపడే హిమని యాక్సిడెంట్‌లో పోగొట్టుకుంటాడు.. అది యాక్సిడెంట్ కాదని, కావాలని చేసిన ప్రమాదమని కార్తీక్‌తో చెబుతుంది దీప్తి. ఈ నేపథ్యంలో మోనిత కథ ఏ మలుపు తిరగబోతోంది?.. వంటలక్క.. తన భర్త డాక్టర్ బాబుతోనే (కార్తీక్) మోనితకు చెక్ పెట్టబోతోందా? అన్నది ఆసక్తికరంగా మారబోతోంది. ఎలాంటి ట్విస్ట్‌లతో వంటలక్క మోనితకి షాకివ్వబోతోందన్నది తెలియాలంటే 952 ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |