![]() |
![]() |

బిగ్‌బాస్ సీజన్ 4 ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. తెలుగు నాట ఈ రియాలిటీ షోకు భారీ క్రేజ్ ఏర్పడింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మొదలైన ఈ టాక్‌షో 108 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించి ఎంటర్‌టైన్ చేసింది. ఈ సీజన్ 4లో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ అభిజీత్ విజేతగా నిలిచాడు.
అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచి ఊసురుమనిపించాడు. తెలివిగా పోటీ నుంచి తప్పుకుని 25 లక్షల క్యాప్ ప్రైజ్‌తో ఇస్మార్ట్ సోహైల్ బిగ్‌బాస్ నిర్వాహకులతో పాటు ఆడియన్స్‌ని ఆశ్చర్యపరిచాడు. సీజన్ పూర్తయ్యే నాటికి ఇందులో పాల్గోన్న కంటెస్టెంట్‌లు అభిజీత్, అఖిల్, సోహైల్, అవినాష్, మోనాల్, దిల్ సే మెహబూబ్, దేత్తడి హారిక, అరియానా, నోయెల్, లాస్య, దివి, కరాటే కల్యాణి, స్వాతీ దీక్షిత్, సూర్యకిరణ్, అమ్మరాజశేఖర్, గంగవ్వ, జోర్దర్ సుజాత చాలా బిజీ అయిపోయారు.
మళ్లీ వీరందరిని ఒకే వేదిక మీదకి తీసుకొస్తోంది 'స్టార్ మా'. 'బిగ్‌బాస్ ఉత్సవం' పేరుతో ఫిబ్రవరి 7న ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. దీనికి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంతా కలిసి ఈ ఉత్సవంలో హంగామా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. దిస్ ఈజ్ ద ప్రైవేట్ పార్టీ అంటూ ... బ్యాగ్రౌండ్ సాంగ్‌తో బిగ్‌బాస్ టీమ్ ఎంట్రీ గోల గోలగా వుంది. సండే రోజు టెలీకాస్ట్ కానున్న ఈ ప్రోగ్రామ్ బిగ్‌బాస్ లవర్స్‌కి పండగే.
![]() |
![]() |