![]() |
![]() |

కథానాయకుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబుది 22 ఏళ్ళ నట ప్రస్థానం. ఈ ప్రయాణంలో 26 సినిమాలతో సందడి చేశారాయన. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సర్కారు వారి పాట.. మహేష్ హీరోగా నటిస్తున్న 27వ చిత్రం. 2022 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. గత సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో పలకరించిన మహేష్.. మళ్ళీ వచ్చే ఏడాది సంక్రాంతికే కొత్త సినిమాతో పలకరించడం అంటే.. 2021 కాస్త తనకి జీరో రిలీజ్ ఇయర్ అయిపోతోందన్నమాట.
ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. కథానాయకుడిగా మహేష్ కెరీర్ లో ఇది మూడో జీరో రిలీజ్ ఇయర్. 1999లో రాజకుమారుడుతో హీరోగా తెరంగేట్రం చేసింది మొదలు.. 2007వరకు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో అలరిస్తూ వచ్చిన ఈ సూపర్ స్టార్.. 2008, 2009లో ఒక్క సినిమాతో కూడా సందడి చేయలేదు. అయితే, మళ్ళీ 2010 నుంచి 2020 వరకు ప్రతీ ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలతో పలకరిస్తూ వచ్చారు. కోవిడ్ ఎఫెక్ట్ తో ఈ ఏడాదే రావాల్సిన సర్కారు వారి పాట ఆలస్యంగా మొదలై.. వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్ళడంతో.. మహేష్ కి ముచ్చటగా మూడో జీరో రిలీజ్ ఇయర్ తప్పడం లేదు.
![]() |
![]() |