![]() |
![]() |

పేరుకి తమిళయుడైనా.. తెలుగువారికి ఎంతో చేరువయ్యాడు టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్. బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ లాంటి సినిమాలతో కథానాయకుడిగా అలరించిన సిద్ధు.. యంగ్ టైగర్ యన్టీఆర్ బాద్ షాలో సహాయక పాత్రలోనూ మురిపించాడు.
కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత సిద్ధార్థ్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో పలకరించబోతున్నాడు. ఆ సినిమానే.. మహా సముద్రం. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మరో యంగ్ హీరో శర్వానంద్ తో కలసి నటిస్తున్నాడు సిద్ధు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాని ఆగస్టు 19న రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆగస్టు నెల సిద్ధుకి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఈ నెలలోనే సిద్ధు హీరోగా నటించిన తొలి చిత్రం బాయ్స్ (2003 ఆగస్టు 29) రిలీజై తెలుగునాట మంచి విజయం సాధించింది. అలాగే.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్, మెమరబుల్ ఫిల్మ్ అయిన బొమ్మరిల్లు విడుదలైంది కూడా ఇదే ఆగస్టులో (2006 ఆగస్టు 09). సో.. సెంటిమెంట్ రిపీట్ అయి, 9 డిజిట్ మరోసారి ప్లస్ అయి ఆగస్టు 19న రాబోతున్న మహాసముద్రం కూడా ఘనవిజయం సాధిస్తుందేమో చూడాలి. అలాగే సిద్ధు రి-ఎంట్రీ మూవీ కాస్త అతనికి గ్రాండ్ కమ్ బ్యాక్ వెంచర్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |