![]() |
![]() |

లేడీ సూపర్‌స్టార్‌గా దక్షిణాది ప్రేక్షకుల చేత, మరీ ముఖ్యంగా తమిళ ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకుంటోన్న నయనతార ఈ రోజు తన 36వ బర్త్‌డేను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమెను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఈ ప్రత్యేకమైన రోజు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.
త్వరలో నయన్‌తో కలిసి నటించబోతున్న టాలీవుడ్ అగ్ర నటి సమంత సైతం ఒక పవర్ఫుల్ బర్త్‌డే నోట్‌ను షేర్ చేసింది. నయన్ ఫొటోనొకదాన్ని షేర్ చేసిన సామ్, "Happy birthday to the one and only Nayanthara.. keep shining brighter and brighter and inspiring us to fight for what is ours... more power to you... sister... salute to your strength and silent determination (ఒన్ అండ్ ఓన్లీ నయనతారకు హ్యాపీ బర్త్‌డే. ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండండి. ఏది మనదో దాని కోసం పోరాడేందుకు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుండండి. సిస్టర్.. మీకు మరింత శక్తి చేకూరాలి. మీ శక్తికీ, నిశ్శబ్ద సంకల్పానికీ నా సెల్యూట్). అని రాసుకొచ్చింది.
తొలిసారిగా ఈ ఇద్దరు అందగత్తెలు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'కాదు వాకుల రెండు కాదల్' అనే మూవీలో తెరను షేర్ చేసుకోబోతున్నారు. రొమాంటిక్ కామెడీగా రూపొందే ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరో.
![]() |
![]() |