![]() |
![]() |

ఏజ్ 35 ప్లస్ దాటినా పెళ్లి చేసుకోని హీరోయిన్లలో త్రిష ఒకరు. యాక్చువల్లీ... ఈపాటికి త్రిష పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యేది. కానీ, రెండుసార్లు ఆమె ప్రేమ పెటాకుల అయ్యింది. దాంతో ఒంటరిగా ఉంటోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కుటుంబాలుగా పిలవబడే ఆ నాలుగు కుటుంబాల్లో ఓ వారసుడితో త్రిష ప్రేమలో పడిందని వార్తలొచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ వాళ్లిద్దరూ జంటగా కనిపించారు. కానీ, ఇద్దరి బంధం పెళ్లి వరకూ రాలేదు. లాక్‌డౌన్‌లో ఆ హీరో పెళ్లి చేసుకున్నారు. తర్వాత తమిళ నిర్మాత వరుణ్ మణియన్‌తో త్రిష ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కానీ, పెళ్లి పీటలకు రాకుండా క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి పెళ్లి గురించి త్రిష ఊసెత్తలేదు.
కొన్నేళ్ల నుంచి త్రిష పెళ్లి విషయాన్ని పక్కనపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడామె జీవితంలో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడటంతో అవి వైరల్ అవుతున్నాయి. ‘‘నా మనసుకు నచ్చిన మనిషి దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా. నన్ను అర్థం చేసుకొనే వ్యక్తి దొరికినప్పుడు నా కొత్త జీవితం మొదలువతుంది. ఒకవేళ అర్థం చేసుకొనేవాడు దొరక్కపొతే జీవితాంతం ఒంటరిగానే ఉంటాను’’ అని త్రిష వ్యాఖ్యానించింది. ఒకవేళ త్రిషను అర్థం చేసుకొనేవాడు దొరక్కపోతే... జీవితాంతం ఆమె ఒంటరిగానే ఉంటుందా? అని సోషల్ మీడియాలో జనాలు గుసగుసలాడుతున్నారు.
![]() |
![]() |