![]() |
![]() |

కెరీర్ ఆరంభం నుంచి సోషల్ డ్రామాలతోనే సందడి చేస్తున్న మెగా కాంపౌండ్ హీరో సాయి తేజ్.. త్వరలో ఓ పిరియడ్ డ్రామా చేయబోతున్నారు. వీరు పోట్ల డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ పాటికే సెట్స్ పైకి వెళ్ళాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోందని సమాచారం.
కాగా, ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభించేందుకు సాయితేజ్, వీరు పోట్ల సన్నాహాలు చేసుకుంటున్నారట. శ్రీ కృష్ణదేవరాయలు కాలం నాటి వాతావరణంతో ఈ పిరియడ్ డ్రామా ఉంటుందని సమాచారం. సాయితేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కనున్న ఈ క్రేజీ వెంచర్ కి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
కాగా, సాయితేజ్ తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఆపై దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా, ఇద్దరు కొత్త దర్శకులతో మరో రెండు చిత్రాలు చేయనున్నారు తేజ్. వీటి తరువాతే వీరు పోట్ల డైరెక్టోరియల్ పట్టాలెక్కుతుందట.
![]() |
![]() |